టీమిండియా ప్లేయర్ హనుమా విహారి చేసిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. ఓ రాజకీయ నేత వల్లే తన కెప్టెన్సీ పోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆంధ్రా టీమ్‌లో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు. ఆంధ్రా టీమ్‌ కెప్టెన్సీకి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఒక రాజకీయ నేత తన రాజీనామాకు కారణమంటూ తెలిపారు. అతనే అసోసియేషన్‌కు చెప్పించి రాజీనామా చేయించాడని.. ఇకపై ఆంధ్రా టీమ్‌కు ఆడనని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న హనుమా విహారి టీమిండియాలో రీఎంట్రీ కోసం శ్రమిస్తున్నాడు. యూపీ చేతిలో ఆంధ్రా టీమ్ ఓడిపోయిన తరువాత సంచలన పోస్ట్ పెట్టాడు. బ్యాటింగ్ మీద దృష్టిపెట్టేందుకో.. మరో కారణంగానో తాను కెప్టెన్సీకి రాజీనామా చేయలేదుని చెప్పుకొచ్చాడు. తాము చివరి వరకు కష్ట పడ్డామని.. కానీ ఓడిపోయామన్నాడు. తాను ఈ పోస్టును కొన్ని వాస్తవాలను తెలియజేసేందుకు పెడుతున్నానని పేర్కొన్నాడు.

గత సీజన్ లో హనుమ విహారి రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆడుతూ.. మణికట్టు గాయానికి గురయ్యాడు. అయితే జట్టు కోసం ఒక్క చేత్తోనే బ్యాటింగ్ చేసి తన పోరాట పటిమను చాటుకున్నాడు. తాను రైట్ హ్యాండ్ బ్యాటర్ అయినప్పటికీ, గాయం వల్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. నాడు కెప్టెన్ గా హనుమ విహారి ప్రదర్శించిన స్ఫూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *