వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఆతడు కాలి మడమ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీ ఆదేశాలతో కాలి మడమకు సర్జరీ చేయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా X (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశాడు. ‘మడమ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. నేను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురుచూస్తున్నా. మళ్లీ క్రికెట్ ఆడేందుకు కొంత సమయం పడుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అదేవిధంగా ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. అయితే ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *