హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాజశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలు రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం ఉదయం కామాక్యమృత శోధన వారిచే జరిగిన పూజలకు నగరం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి అశేష భక్తజనం కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శత రాజశ్యామల హోమము, శివ పార్వతుల కళ్యాణం, లలితా సహస్రనామ పారాయణం, శ్రీ యంత్ర సిరి జ్యోతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దేవతామూర్తుల ప్రత్యేక దర్శనం తీర్థప్రసాదాలను అమ్మవారి అనుగ్రహ ము అందజేశారు నిర్వాహకులు.