త్వరలో జరగబోయే లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​పార్టీలో ఒక్కసాగిగా ఆశావహులు పుట్టుకొస్తున్నారు. గతంలో పోటీకి నై అన్న నేతలు దేశ రాజకీయాల్లో భారీగా మార్పులు కనిపిస్తుండడంతో నేను సైతం అంటూ ముందస్తుగానే కట్​చీఫ్​ వేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఇండియా కూటమికి కాంగ్రెస్​కు మధ్య లోక్​సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్​ పార్టీ నేతలు పోటీకి సై అంటూ సైగ చేస్తున్నారు. ఖమ్మం లోక్​సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, ఎప్పటి నుంచే నియోజకవర్గం ప్రజలకు సేవలు అందిస్తున్నానంటూ సీనియర్​ నేత వి. హన్మంతరావు సోమవారం గాంధీభవన్​లో మీడదియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అలాగే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తన పదవికి రాజీనామాను సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తాను నాగర్​కర్నూల్​ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటూ సీఎంకు తెలిపానని, సీఎం సైతం మద్దతు ప్రకటించారన్నారు.

అయితే నాగర్​కర్నూల్​ నుంచి ఆలంపూర్​ మా.జీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ సైతం పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్​లో చేఇ మరోసారి పోటీ చేయాలని ప్రస్తుతం బీఆరహ్​ఎస్​ ఎంపీ పోతుగంటి రాములు ప్రయత్నించినట్లు, ల​యితే ఇక్కడ పోటీకి కుదరన్న సంకేతాలు సీఎం నుంచి రావడంతో ఆయన మనసు మార్చుకొని బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. అలాగే పెద్దపల్లి , వరంగల్​, మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్​ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్​ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే రాహుల్​గాంధీ, సీఎం రేవంత్​ను అడిగి టికెట్​ తీసుకుంటానంటూ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *