గోల్నాక డివిజన్లోని శ్రీ వరాల ఆంజనేయస్వామి దేవస్థానం 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకము సింధూర పూజ ఆకు పూజ వ్రతాలు తదితర పూజలు ఆలయ పూజారి రాజేష్ ఆధ్వర్యంలో జరిపించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు యాదగిరి కిషోర్ నాయుడు దామోదర్ నాయుడు విజయ్ కుమార్ చంద్రశేఖర్ కర్నేష్ తదితరులు ఈ పూజలలో పాల్గొన్నరు ఈ పదవ వార్షికోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా అంబర్పేట నియోజకవర్గం శాసనసభ్యులు కార్లు వెంకటేశు హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల లో పాల్గొన్నారు. ఆలయ పూజారి రాజేష్ కాలర్ వెంకటేష్ ను ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు.